నిత్య అన్నదానానికి విరాళం
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న కాశీ పీఠాధిపతులు పరివ్రాజకాచార్య శివ నాగేంద్ర సరస్వతి
నిత్య అన్నదానానికి సురేందర్ పది లక్షల విరాళం
స్వామివారి నిత్య రాబడి 21,28,545/
యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): మహిమాన్విత క్షేత్రంలో ఒకటైన యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని కాశీ పీఠం సంస్థానానికి పీఠాధిశ్వరులు, పరమహంస పరివ్రాజకాచార్య శ్రీశ్రీశ్రీ శివ నాగేంద్ర సరస్వతి స్వామీజీ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్వకుంభంతో స్వాగతం పలికారు. దర్శన అనంతరం దేవస్థానం కార్యనిర్వాహణాధికారి భవాని శంకర్ స్వామి వారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం అనుబంధాలయమైన శ్రీ పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
నిత్య అన్నదాన పథకానికి 10 లక్షల విరాళం, హైదరాబాద్‌కు చెందిన సురేందర్ రెడ్డి ప్రవీణ దంపతులు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి నిత్య అన్నదాన పథకానికి 10,00,116/- విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థాన కార్యనిర్వాహణాధికారి భవాని శంకర్ దాత దంపతులను కృతఙ్ఞతలు తెలిపి స్వామివారి దర్శనం ఆశీర్వచనం ఏర్పాటు చేశారు. స్వామివారి నిత్య రాబడి 21,28,546/- వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.