పారిశుద్ధ్య లోపం నివారణకు చర్యలు తీసుకోవాలి...

29-09-2026 | 06:59pm

తాడ్వాయి,సెప్టెంబర్,29( విజయ క్రాంతి): గ్రామంలో పారిశుద్ధ్య లోపం నివారణకు చర్యలు తీసుకోవాలని తాడువాయి ఎంపీడీవో భరత్ కుమార్ (Taduvai MPDO Bharat Kumar)తెలిపారు.కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కాళోజివాడి గ్రామంలో మంగళవారం ఆయన గ్రామపంచాయతీలో జరిగిన సమావేశానికి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...

ఎప్పటికప్పుడు మురికి కాలువలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి వేయాలని సూచించారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పైపులైన్ లలో ఎక్కడైనా లీకేజీలు ఉంటే వెంటనే మరమ్మతులు చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చంద్ర రెడ్డి,,ఉప సర్పంచ్ సాయికుమార్, కార్యదర్శి సతీష్,ఏఈఓ హారిక తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు