నాగల్‌గిద్ద అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి
29-09-2026 | 07:16pm
నాగల్‌గిద్ద, సెప్టెంబర్ 29 (విజయ క్రాంతి): నాగల్‌గిద్ద మండల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని మాజీ మండల అధ్యక్షుడు మాణిక్‌రావు పటేల్(Former Mandal President Manikrao Patel) కోరారు. సోమవారం హైదరాబాద్‌లో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. మండలంలోని పలు గ్రామాల్లో రహదారులు,
తాగునీరు తదితర మౌలిక వసతులను మరింత మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. గ్రామీణ ప్రజలకు అవసరమైన సదుపాయాల కల్పనకు ప్రత్యేక నిధులు మంజూరు చేసి మండల అభివృద్ధికి సహకరించాలని కోరారు. తన విజ్ఞప్తిపై ఎంపీ సానుకూలంగా స్పందించి, నాగల్‌గిద్ద మండలంలోని గ్రామాల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు మాణిక్‌రావు పటేల్ తెలిపారు.