గురి పెట్టింది.. గోల్డ్ కొట్టింది
29-09-2026 | 11:35am
ఏషియన్ గేమ్స్ 2026లో భారత షూటర్ నీరూ ధాండా స్వర్ణ పతకం సాధించారు. మహిళల ట్రాప్(Womens trap) వ్యక్తిగత విభాగం ఫైనల్లో వర్షాన్ని లెక్కచేయకుండా అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఐచి ప్రిఫెక్చర్ జనరల్ షూటింగ్ గ్యాలరీలో ప్రత్యర్థులపై ఆధిపత్యం ప్రదర్శిస్తూ అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు.