మోతె మండల పరిషత్ కార్యాలయంలో జెడ్పీ సీఈఓ ఆకస్మిక తనిఖీ

29-09-2026 | 07:09pm

మోతె, సెప్టెంబర్ 29 (విజయ క్రాంతి): మంగళవారం  మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయాన్ని( Mandal Parishad office) జెడ్పీ సీఈఓ శిరీష(ZP CEO Sirisha)  ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండల వ్యాప్తంగా కొనసాగుతున్న పింఛన్ల వెరిఫికేషన్, ఆన్‌లైన్ నమోదు ప్రక్రియపై ఎంపీడీవో, ఎంపీవోలను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

వికలాంగులు, వితంతువుల పింఛన్ల వెరిఫికేషన్ ఎంతవరకు పూర్తయింది, లబ్ధిదారుల వివరాలను ఏ విధంగా పరిశీలిస్తున్నారనే అంశాలపై ఆమె ఆరా తీశారు. సంబంధిత రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించిన ఆమె, అన్ని వివరాలను పూర్తిస్థాయిలో నమోదు చేసి, రికార్డులను సక్రమంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.

వీబీ-జీ రామ్ జీ పనులపై సమీక్ష అనంతరం వీబీ-జీ రామ్ జీ పథకం కింద చేపడుతున్న పనులపై సీఈఓ శిరీష సమీక్ష నిర్వహించారు. పనుల ప్రణాళిక, అంచనాలు, ప్రస్తుత పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ తనిఖీలో ఎంపీడీవో సందీప్ కుమార్, ఎంపీవో వంశీ కృష్ణ, ఈసీ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు