రెడ్‌హిల్స్‌లో ‘ఇందిరమ్మ’ అడుగు

29-09-2026 | 12:54pm

నాంపల్లి రెడ్‌హిల్స్‌లో 480 ఫ్లాట్లతో ఇందిరమ్మ టవర్స్

హైదరాబాద్‌ నాంపల్లి నియోజకవర్గంలోని రెడ్‌హిల్స్‌(Redhills)లో 480 ఎల్‌ఐజీ ఫ్లాట్లతో ఇందిరమ్మ టవర్స్‌ నిర్మాణానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.43.20 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ నిర్మాణాలను ఏడాదిలో పూర్తి చేసి పేదలకు ఫ్లాట్లు అందిస్తామని తెలిపారు.

ప్రైమ్‌ ఏరియాల్లో విలువైన ప్రభుత్వ భూములను పేదల సంక్షేమానికి వినియోగిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. లక్షల రూపాయల విలువైన ఫ్లాట్లను లబ్ధిదారులకు ఎలాంటి ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్‌ చేసి అందిస్తామని చెప్పారు. ఫ్లాట్లపై రుణాలు పొందే సౌకర్యం కూడా కల్పిస్తామన్నారు.క్యూర్‌ పరిధిలో మొత్తం నాలుగు విడతల్లో ఇళ్లను మంజూరు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. పేదల సంతోషం, సంక్షేమమే ప్రభుత్వానికి ముఖ్యమని, ఇందిరమ్మ టవర్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగిస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు