ప్రీ ప్రైమరీ పాఠశాలలపై షార్ట్ ఫిలిం చిత్రీకరణ

11-09-2026 | 10:54pm

పాపన్నపేట: దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలలో నెలకొల్పిన ప్రీ ప్రైమరీ పాఠశాలల(pre primary schools) ఏర్పాటు, అందుకోసం నెలకొల్పిన సౌకర్యాలను అందరికి అవగాహన కల్పించేందుకు అంజాగౌడ్ రచనా దర్శకత్వంలో షార్ట్ ఫిల్మ్ చిత్రీకరణ(Short film shooting on pre-primary schools)ను కుర్తివాడ ప్రాథమిక పాఠశాలలో జరిపారు. దీనికి కెమెరా మెన్ ప్రదీప్, ఎడిటర్ గా నరేష్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్  ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రావు, ఉపాధ్యాయులు జనార్దన్, మల్లేష్, శ్రీనివాస్, వెంకట్రాం రెడ్డి, బాలరాజు, రాగిణీ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు