ఘనంగా వినాయక చవితి, హిందీ దినోత్సవ వేడుకలు

12-09-2026 | 12:19am

నర్సాపూర్: విష్ణు ఉన్నత పాఠశాల(Vishnu High School)లో శుక్రవారం వినాయక చవితి, హిందీ భాషా దినోత్సవ వేడుకల(Hindi Day celebrations)ను ఘనంగా నిర్వహించారు. ప్రముఖ హిందీ కవి తులసీదాస్ చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు పి. నాగజ్యోతి, హిందీ ఉపాధ్యాయులు హిందీ భాష ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారిని అభినందించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా విద్యార్థులతో మట్టి వినాయక ప్రతిమలను తయారు చేయించి పూజలు నిర్వహించారు. వినాయక చవితి(Vinayaka Chavithi) విశిష్టతను ఉపాధ్యాయులు వివరించారు. కార్యక్రమంలో బీవీఆర్‌ఐటీ డైరెక్టర్ లక్ష్మీప్రసాద్, మేనేజింగ్ డైరెక్టర్ బాపిరాజు, ఏవో సురేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు