డిజిటల్ పంటల సర్వేకు సహకరించండి: ఏవోఈ పైడితల్లి

12-09-2026 | 12:10am

చిన్నబొంకూర్‌లో క్షేత్రస్థాయి పరిశీలన

సుల్తానాబాద్,(విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా(Peddapalli District) ​సుల్తానాబాద్ మండల పరిధిలోని చిన్నబొంకూర్ గ్రామంలో వ్యవసాయ శాఖ(Department of Agriculture) చేపట్టిన డిజిటల్ క్రాప్ సర్వే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం వ్యవసాయ అధికారి పైడితల్లి(AOE Pydithalli) క్షేత్రస్థాయిలో సాగు భూములను సందర్శించి సర్వే పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు.  వాలంటీర్లు మొబైల్ అప్లికేషన్ ద్వారా చేపడుతున్న జియో ట్యాగింగ్ విధానాన్ని, సాగు వివరాల నమోదును ఆమె పర్యవేక్షించారు. ఎలాంటి సాంకేతిక సమస్యలు రాకుండా ప్రతి ఎకరాను పక్కాగా రికార్డు చేయాలని సిబ్బందికి మార్గదర్శనం చేశారు.

మొబైల్‌కు సందేశం.. 72 గంటల్లో సవరణ గడువు

​రైతుల సమక్షంలో వాలంటీర్లు నమోదు చేసిన పూర్తి పంట వివరాలు తక్షణమే సంబంధిత రైతు నమోదిత ఫోన్ నంబర్‌కు ఎస్ఎంఎస్ ద్వారా చేరతాయని పైడితల్లి వివరించారు. ఈ వివరాలను రైతులు క్షుణ్ణంగా సరిచూసుకోవాలి. ఒకవేళ సాగు విస్తీర్ణం, వేసిన పంట రకం లేదా సర్వే నంబర్లలో ఏవైనా పొరపాట్లు ఉంటే వెంటనే గుర్తించాలి. సందేశం వచ్చిన 72 గంటల వ్యవధిలోనే స్థానిక వ్యవసాయ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లి అవసరమైన సవరణలు పూర్తి చేసుకోవాలని రైతులకు సూచించారు. గడువు దాటితే రికార్డుల్లో మార్పులు చేయడం సాధ్యపడదని తెలిపారు,మండలంలోని వాలంటీర్ లకురైతులుసహకరించాలని కోరారు.

మరిన్ని వార్తలు