ఫోక్ డ్యాన్సర్‎కు ముందస్తు బెయిల్

11-09-2026 | 06:01pm

హైదరాబాద్: మాధురి రాథోడ్‌ దాఖలు చేసిన బీఎన్‌ఎస్‌, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు(SC/ST Atrocity Case)లో ఈశ్వర్ సాయికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈశ్వర్ సాయి తరఫున న్యాయవాది నాగూర్‌బాబు వాదనలు వినిపించారు. పెళ్లైన వ్యక్తితో మాధురి రాథోడ్ సంబంధం కొనసాగించిన అంశాన్ని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మీడియా సానుభూతి పొందేందుకు తీవ్ర ఆరోపణలతో తప్పుడు కేసులు నమోదు చేశారని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం ఈశ్వర్ సాయికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

మరిన్ని వార్తలు