స్మార్ట్‌ఫోన్ ఉంటే సరిపోదు… స్మార్ట్ ఆలోచన ఉండాలి
11-09-2026 | 12:04pm
భారతదేశం: భారత్‌లో చాలామంది చదువుకున్నవాళ్లు ఉన్నారు.. కానీ ప్రతి కొత్త యాప్, ప్రతి కొత్త ట్రెండ్(New trend) గురించి ఆలోచించే ముందు, దాని వల్ల వచ్చే అసలు సమస్యల గురించి కూడా ఆలోచించాలి.
కొత్త యాప్ వస్తే ఫోన్ ఎలా ట్రెండ్ చేయాలి? ఎలా వైరల్ చేయాలి? అనే ఆలోచనలే కాకుండా.. దాని వెనుక ఉన్న భద్రతా సమస్యలు, దేశ భద్రతకు వచ్చే ముప్పులు ఏంటి అనేది కూడా అర్థం చేసుకోవాలి.గతంలో ఇలాంటి టెక్నాలజీకి సంబంధించిన ఘటనల తర్వాత జరిగిన పరిణామాలను మనం చూశాం. అప్పుడు మన స్పందనను మన దేశ ప్రజలు ఒక్కటిగా చూపించారు.
మరి ఇప్పుడు మరోసారి ఏదైనా పెద్ద సమస్య వస్తే.. కేవలం ఫొటోలు పెట్టి సోషల్ మీడియాలో స్పందించడం సరిపోతుందా? టెక్నాలజీని ఉపయోగించడంలో ట్రెండ్ కంటే ముందు బాధ్యత, అప్రమత్తత, దేశ భద్రత గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది.