కొండగట్టు బస్సుప్రమాదానికి నేటితో ఎనిమిదేళ్లు..!
11-09-2026 | 12:43pm
మల్యాల, సెప్టెంబర్ 11,(విజయక్రాంతి): మల్యాల జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో కొండగట్టు ఘాట్ రోడ్డు బస్సు ప్రమాద విషాదానికి(Kondagattu Ghat Road bus accident) నేటితో ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి. 2018 సెప్టెంబర్ 11న శనివారంపేట నుంచి జగిత్యాల వస్తున్న ఆర్టీసీ బస్సు ఘాట్ రోడ్డులో అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో సుమారు 67 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపిన ఈ ఘటనలో ఎన్నో కుటుంబాలు తమ ఆత్మీయులను కోల్పోయాయి. ఏళ్లు గడుస్తున్నా ఆ దుర్ఘటన జ్ఞాపకాలు, కుటుంబ సభ్యుల కన్నీటి గుర్తులు మాత్రం చెరిగిపోలేదు.