ప్రభుత్వం విద్యాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తోంది

12-09-2026 | 12:05am

పోచారం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు కర్రె రాజేష్

విద్యార్థులకు ఉచిత విద్యా కిట్ల పంపిణీ కార్యక్రమం

ఘట్ కేసర్,(విజయక్రాంతి): ప్రభుత్వం విద్యాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తోందని పోచారం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు కర్రె రాజేష్ అన్నారు. పోచారం డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప ప్రాథమిక పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఉచిత విద్యార్థుల కిట్లు, స్కూల్ బ్యాగులు, యూనిఫాం డ్రెస్సులు, షూలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాభివృద్ధికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి మెరుగైన విద్యా సౌకర్యాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది అన్నారు.

అదేవిధంగా పాఠశాలలో విద్యార్థుల విద్యకు మరింత తోడ్పాటు అందించేందుకు పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ బద్దం నర్సింహ రెడ్డి ఒక టీచర్‌ను డొనేట్ చేసి వారి జీతం నిమిత్తం రూ. 50 వేలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేష్ కి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇటికల కృష్ణరెడ్డి, మాజీ మున్సిపల్ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మెట్టు గణేష్ యాదవ్, ఎస్సీ సెల్ అధ్యక్షులు బద్దం కుమార్, బండ్లగూడ నగేష్ గౌడ్, రాజీవ్ గృహకల్ప అధ్యక్షులు గంధమల్ల రమేష్ గౌడ్, నరేష్ గౌడ్, సారగండ్ల రమేష్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు