ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి వివరణ

11-09-2026 | 12:14pm

హైదరాబాద్ లో లక్ష ఇళ్లు మంజూరు

హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్లపై శాసనమండలిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivasa Reddy) వివరణ ఇచ్చారు. కాంగ్రెస్(Congress) అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో 4.5 లక్షల ఇళ్లు మంజూరు చేశారని పొంగులేటి వెల్లడించారు. రెండో ఏడాది 2.50 లక్షల ఇళ్లు మంజూరు చేశామని పేర్కొన్నారు. హైదరాబాద్(Hyderabad)లోని అన్ని నియోజకవర్గాల్లో లక్ష ఇళ్లు మంజూరు(Indiramma houses) చేసినట్లు తెలిపారు. అర్హులైన పేదలకు ఎంపిక చేసి ఇళ్లు మంజూరు చేస్తున్నామని వివరించారు. లాటరీ విధానంలో పూర్తి పారదర్శకంగా ఇళ్ల కేటాయింపు జరుగుతోందని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు