సీనియర్ కాంగ్రెస్ నేతకు బాలసాని పరామర్శ
ఆర్థిక సాయం అందించిన మాజీ ఎమ్మెల్సీ
వెంకటాపురం,(విజయ క్రాంతి): మండలంలోని భోదాపురం పంచాయతీ కాంగ్రెస్ పార్టీ(Congress Party) సీనియర్ నాయకులు కంతి చందర్రావు కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ(Former MLC Balasani Lakshminarayana) పరామర్శించారు కంతి చందర్రావు సతీమణి ఇటీవలే స్వర్గస్తులైన విషయాన్ని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యం కల్పించారు. ఈ విషాద సమయంలో కుటుంబానికి అండగా నిలుస్తూ ఆర్థిక సహాయం అందించారు. అంతేకాకుండా కుటుంబానికి ఎల్లవేళలా అన్ని విధాలుగా తోడుగా ఉంటామని భరోసా కల్పించారు. కష్టకాలంలో కార్యకర్తలకు నాయకులు అండగా నిలవడమే నిజమైన నాయకత్వానికి నిదర్శనమని నిరూపించారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి పాయం రమణ, కాంగ్రెస్ యువ నాయకులు బాలసాని వేణుగోపాల్, సీనియర్ నాయకులు గుండమల్ల కిరణ్,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.