చేగుంటలో ఖేలో ఇండియా రగ్బీ పోటీలు

29-09-2026 | 06:27pm

చేగుంట సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): చేగుంటలోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం గ్రౌండ్లో బుధవారం నుండి అండర్ 15, అండర్ 18 బాలికల (అస్మిత) ఖేలో ఇండియా రగ్బీ పోటీలు(Khelo India Rugby) నిర్వహిస్తున్నట్లు జిల్లా రగ్బి అసోసియేషన్ అధ్యక్షులు కర్ణం గణేష్ రవికుమార్ తెలిపారు. అండర్ 15 పోటీల్లో పాల్గొని బాలికలు 2011- 2013 మధ్య జన్మించిన వారై, అండర్ 18 బాలికలు 2008-2009 జన్మించిన వారే ఉండాలనీ, 2010లో జన్మించిన వారు డాక్టర్ దగ్గర ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకొని రావలెననీ అన్నారు, ఈ పోటీలు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతాయి అని తెలిపారు.

మరిన్ని వార్తలు