బెల్లంపల్లిలో ఎంహెచ్డీ నిరసన

09-09-2026 | 10:24pm

బెల్లంపల్లి,(విజయక్రాంతి): దళితులు నిరసన తెలిపిన రోడ్లను పసుపు,పాలతో శుద్ధి చేసి దళిత సమాజాన్ని అవమానించిన వారిపై SC ST అట్రాసిటీ కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలనీ డిమాండ్ చేస్తూ బెల్లంపల్లి పట్టణం Dr BR అంబేడ్కర్ చౌరస్తాలో మాదిగ హక్కుల దండోరా(Madiga Hakkula Dandora) ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. పట్టణ అధ్యక్షుడు ఎనగందుల శివాజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిలుక రాజనర్సు  హాజరై మాట్లాడారు.  స్పీకర్ గడ్డం ప్రసాద్(Speaker Gaddam Prasad)పై  BRS MLC తాతా మధు అనుచిత వ్యాఖ్యలకు BRS పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ బాధ్యత తీసుకొని BRS పార్టీ నుండి బహిస్కరించాలినీ డిమాండ్ చేశారు.

మా మాదిగ డప్పులతో రోడ్ల మీదకు వచ్చి శాంతి యుతంగా నిరసన తెలిపితే BRS పార్టీ నాయకులు కార్యకర్తలు మాదిగలు రోడ్ల మీద నిరసన తెలిపితే, దళితులు  అంటారని వాళ్ళునీ ఆ రోడ్లను మైల పరిచారని ఆ రోడ్లను పసుపునీళ్ళు,పాలతో శుద్ధి చేసి BRS పార్టీ నాయకులు కుల దురంకరాన్ని చాటుకున్నారన్నారు. ఈ చర్యను మాదిగ హక్కుల దండోరా MHD తీవ్రంగా ఖండిస్తుందన్నారు. BRS పార్టీకి దళితుల మీద ఎంత వ్యతిరేకతతో ఈ సంఘటనే రుజువు చేస్తుందన్నారు. ఒక దళితుడు ఉన్నత స్థానంలో ,రాజ్యాంగ బద్ధమైన స్పీకర్ పదవిలో ఉంటే ఓర్చుకోలేని అగ్రకుల దురహంకారులు రాజ్యాంగ బద్ధమైన చట్ట సభలో ఉండి కూడా కనీసం రాజ్యాంగ బద్ధమైన స్పీకర్ కుర్చీని కూడా గౌరవించక పోవడం చోచనీయమన్నారు. 

BRS పార్టీ అధినేత KCR ఇంటికి వెళ్లి నిరసన తెలుపడానికి వెళితే, పోలీసులు అడ్డుకొని KCR ఇంటికి వెళ్లనివ్వకుంటే, అక్కడే రోడ్డు మీద మాదిగ డప్పులతో నిరసన తెలిపితే,దళితులు అంటారని వారనీ అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.దళితులను ఏ రాజకీయ పార్టీ అవమానిస్తుందో ఆ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ అని అన్నారు. ఇప్పటికైన BRS పార్టీలో ఉన్న ఉన్న దళిత నాయకులు స్పందించాలని కోరారు. దళితులను వ్యతిరేకించిన పార్టీలకు రానున్న ఎన్నికల్లో  ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెపుతామని హెచ్చరించారు. 

మరిన్ని వార్తలు