ఘనంగా "ప్రజాకవి" కాళోజి నారాయణరావు జయంతి

09-09-2026 | 10:41pm

నేరేడుచర్ల,(విజయక్రాంతి): "తెలంగాణ భాషా దినోత్సవం" ప్రజాకవి "పద్మవిభూషణ్" కాళోజి నారాయణరావు 112వ జయంతి మహోత్సవాన్ని పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(PM Sri Zilla Parishad High School) నేరేడుచర్ల నందు ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు బట్టు మధు,ఉపాధ్యాయులు విద్యార్థులు కాళోజి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "పుట్టుక నీది చావు నీది బ్రతుకంతా దేశానిది" వాక్యం కాళోజి జీవితానికి చక్కగా సరిపోతుంది.

తెలుగు సాహిత్య రంగంలో తెలంగాణ యాసకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకువచ్చి తెలంగాణ భాషా వైతాళికులుగా ప్రసిద్ధి చెందారని, రచనల్లో తెలుగునాట ఆయా ప్రాంతాల యాసకు సముచిత గౌరవం దక్కాలని నినదిస్తూ,నాడు వివక్షతను ఎదుర్కొంటున్న తెలంగాణ యాసకు పెద్దపీట వేస్తూ రచనలు చేసి,"బడి పలుకుల భాష కాదు పలుకుబడుల భాష నాది"అని ఎలుగెత్తి చాటారని,కాళోజి కవితల సమగ్ర సంకలనం"నా గొడవ"అనేది తమ హక్కులను అందుకోలేని,ఆసరా లేని నిస్సహాయులందరి గొడవ గా కొనియాడబడిందనీ పేర్కొన్నారు ఉపాధ్యాయులు విద్యార్థులు కాళోజికి జోహార్లు అర్పించారు.

మరిన్ని వార్తలు