లక్షెట్టిపేట పట్టణ పెరిక యువజన సంఘం ఎన్నిక

06-11-2026 | 08:08pm

లక్షెట్టిపేట, (విజయక్రాంతి ): మంచిర్యాల జిల్లా పెరిక(Mancherial District Perika) అధ్యక్షులు బొడ్డు శంకర్, యువజన అధ్యక్షులు కారుకూరి మనోజ్ ఆధ్వర్యంలో లక్షెట్టిపేట పట్టణ పెరిక యువజన కమిటీని శుక్ర వారం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా రాందేని వెంకటేష్, మండల పెరిక యువజన అధ్యక్షులుగా బియ్యాల దినేష్ , పట్టణ పెరిక యువజన వైస్ ప్రెసిడెంట్ లగిశెట్టి తరుణ్, ప్రధాన కార్యదర్శిగా గొల్ల అనిల్ కుమార్, మహిళా టౌన్ పెరిక అధ్యక్షులుగా గడిగొప్పుల వజ్ర, ప్రధాన కార్యదర్శిగా సూరం సౌజన్య, గౌరవ అధ్యక్షులుగా గోపె రమ, ఉపాధ్యక్షులుగా ఎమ్మడి మల్లమ్మలని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా పెరిక జనరల్ సెక్రటరీ రాజ్ కిరణ్, మండల అధ్యక్షులు రమేష్, అధ్యక్షులు అశోక్, తోట సాగర్, మహిళా అధ్యక్షురాలు సరోజ, కందుల లింగన్న, గడ్డం మహేష్, బియ్యాల సాయి చరణ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు