పట్టభద్రులు సద్వినియోగం చేసుకోవాలి
29-10-2026 | 09:35pm
రాజాపూర్: ఎమ్మెల్సీ ఓటు హక్కు సద్వినియోగం చేసుకునే పట్టభద్రులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న అనంతరం గజిటెడ్ సంతకం కోసం రాజాపూర్ మండల పట్టభద్రులు ఇబ్బందులు పడుతున్నారన్న విషయం తెలుసుకున్న మండల విద్యాధికారి సుధాకర్ రాజాపూర్ మండల కేంద్రంలోని ఎమ్మార్సీ భవనంలో కేవలం పట్టభద్రుల కోసం అందుబాటులో ఉండనున్నట్లు తెలిపారు.ఈ సదవకాశాన్ని మండల కేంద్రంతోపాటు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పట్టభద్రులు సద్వినియోగం చేసుకోని ఓటు హక్కును పొందాలనిఎంఈఓ విజ్ఞప్తి చేశారు.