అన్నపూర్ణ దేవిగా దర్శనమిచ్చిన భ్రమరాంబిక
13-10-2026 | 07:39pm
రాజాపూర్ అక్టోబర్ 13: మండలంలోని తిరుమలాపూర్ గ్రామం(Tirumalapur village)లో వెలసిన భక్తుల ఇలవేల్పైనా శ్రీ భ్రమరాంబికా మాత మంగళవారం అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీభ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవాలయంలో కొలువైన భ్రమరాంబికా దేవిని ఆలయ అర్చకులు నరసింహమూర్తి భక్తులు అన్నపూర్ణాదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.