వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

13-10-2026 | 04:59pm

రాజాపూర్ అక్టోబర్ 13: మండలంలోని ఖానాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని(Free Eye Camp) గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ పూజారి శేఖర్ తెలిపారు. లైఫ్ ఆఫ్ ద పీపుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం గ్రామంలో ఏర్పాటుచేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటిచూపుతో బాధపడుతున్న వారందరూ వైద్య పరీక్షలు చేసుకుని వైద్యుల సూచన మేరకు మందులు అద్దాలు వాడాలని ఈ సందర్భంగా కోరారు.

మరిన్ని వార్తలు