వారితోషకం అందించిన ఉపాధ్యాయ వెల్ఫేర్ సొసైటీ
బోథ్. అక్టోబర్ 13 (విజయక్రాంతి) మండల కేంద్రంలోని వివిధ పాఠశాలలో చదివి పదవ తరగతి లో 2025 26వ సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను టీచర్స్ వెల్ఫేర్ సొసైటీ(Teacher Welfare Society) వారు అభినందించి విద్యార్థులకు పారితోసకంఅందించారు.
మండల కేంద్రానికి చెందిన బాలికల ఉన్నత పాఠశాల నుండి ఎం శివాని, అక్షర, బాలుర ఉన్నత పాఠశాల నుండి శ్రీరామ్ హర్షిత్, ఎం శివాని, ఉర్దూ పాఠశాల నుండి రేష్మ, ఆఫ్రిన్, ప్రభుత్వ హెచ్ఎస్ బోత్ పాఠశాలలో చదివిన ఏ శివకుమార్, ఆర్ కృష్ణ లను సన్మానించారు.
ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించి ఇటీవల నీటి ఫలితాలలో ఎంబీబీఎస్ సీటు సాధించిన నిరుపేద విద్యార్థి సాయి చరణ్ కు 10000 రూపాయలు సహాయం అందించి సన్మానించారు. కార్యక్రమంలో టి డబ్ల్యూ ఎస్ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, కోశాధికారి సంఘ సభ్యులు పాల్గొన్నారు.