కాంగ్రెస్కు షాక్
12-09-2026 | 10:18pm
మిడ్జిల్: మిడ్జిల్ మండలం బైరంపల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ(Congress Party) నాయకులు బీఆర్ఎస్(BRS)లో చేరారు. మాజీ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో బండారు పెద్ద ఎల్లయ్య, లకుమల నరేష్, కోర్నె శ్రీశైలం, గొడుగు వెంకటేష్, పోలె శివ ఉన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోపాల్ ముదిరాజ్, మాజీ మార్కెట్ డైరెక్టర్ కాడయ్య, బీఆర్ఎస్ నాయకులు వెంకటయ్య ముదిరాజ్, వెంకటయ్య గౌడ్, యాదయ్య గౌడ్, మల్లేష్, కృష్ణ ప్రసాద్, నారాయణ, భాగం రాములు, పరుశరాములు తదితరులు పాల్గొన్నారు.