బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం

06-10-2026 | 07:23pm

గండీడ్: అక్టోబర్ 6 విజయక్రాంతి: ఉమ్మడి గండీడు మండలాల బీఆర్‌ఎస్ పార్టీ(BRS Party) ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే  కొప్పుల మహేష్ రెడ్డి(Former MLA Koppula Mahesh Reddy) సూచనల మేరకు ఉమ్మడి మండలాల అధ్యక్షులు పెంట్యా నాయక్, దిడ్డికాడి గోపాల్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదు ప్రక్రియపై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. గ్రామాల వారీగా ఇన్‌చార్జ్‌లను నియమించి, గతంలో ఓటు వేసిన వారితో పాటు అర్హత కలిగిన కొత్త ఓటర్లను గుర్తించి ఓటు నమోదు చేయించాలని సూచించారు. అర్హులైన వారు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేలా కార్యకర్తలు చొరవ తీసుకోవాలని తెలిపారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయానికి ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని, గ్రామస్థాయిలో ఓటర్ల నమోదు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని నాయకులు సూచించారు.

ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు వెంకట్ రాంరెడ్డి, రాజకుమార్ రెడ్డి, బెస్త రాజు, నరసప్ప సార్, రాంచంద్రారెడ్డి, బిక్షపతి, సర్పంచులు సుజాత, లక్ష్మి, జిన్నారం గోపాల్, మహేష్ రెడ్డి, అశోక్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, ఆంజనేయులు, బి. వెంకట్ రాములు, ఖాదర్, వెన్నచేడ్ వెంకట్ రాములు, కృష్ణ గౌడ్, కిష్టయ్య, చెవులచంద్రయ్య, వెంకటయ్య, కోటకొండ గోపాల్, హన్మాంతు,అర్. కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్, నీలేష్,రవి,కిష్టారెడ్డి, ఉప సర్పంచులు జంగళ్ల భీమయ్య, రవికాంత్, రాములు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు