పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నహక సమావేశం

06-10-2026 | 08:11pm

ఓటర్ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న దేవరకద్ర  మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి

మూసాపేట్ /అక్టోబర్ 6: మూసాపేట మండల పరిధిలోని జానంపేట గ్రామంలో మంగళవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి(Ala Venkateshwar Reddy) పాల్గొని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ప్రతి పట్టభద్రుడు తమ ఓటును నమోదు చేసుకోవాలని సూచించారు. పట్టభద్రుల హక్కులను కాపాడేందుకు, ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. అర్హత కలిగిన పట్టభద్రులు ఓటర్‌గా నమోదు చేసుకుని తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, పట్టభద్రులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు