ప్రపంచ సాంకేతిక కేంద్రంగా తెలంగాణ

31-10-2026 | 05:20am
  1. మౌలిక వసతులు, ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణం
  2. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 
  3. పోచారం ఇన్ఫోసిస్‌లో నూతన సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ బ్లాక్ ఏర్పాటు
  4. ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రి శ్రీధర్‌బాబు   

ఘట్ కేసర్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): తెలంగాణను ప్రపంచస్థాయి సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా హైదరాబాద్‌లోని పోచారం ఇన్ఫోసిస్ డెవలప్‌మెంట్ సెంటర్(Infosys Development Center) మరో కీలక మైలురాయిని చేరుకుంది. పోచారం క్యాంపస్‌లో కొత్తగా నిర్మించిన 1.1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలోని సాఫ్ట్ వేర్ డెవలప్‌మెంట్ బ్లాక్‌కు డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శుక్రవారం ప్రారంభించారు.

ఈ విస్తరణతో తెలంగాణలో తమ కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడంతో పాటు, యువతకు అధునాతన సాంకేతిక రంగాల్లో ఉపాధి అవకాశాలు పెంచనున్నట్లు ఇన్ఫోసిస్ వెల్లడించింది. 450 ఎకరాల్లో విస్తరించి ఉన్న పోచారం ఇన్ఫోసిస్ క్యాంపస్లో ఇప్పటికే ఏడు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ బ్లాక్లు, సుమారు 4.58 మిలియన్ చదరపు అడుగుల కార్యాలయ విస్తీర్ణం ఉన్నాయని, తాజాగా ప్రారంభించిన నూతన భవనంతో అదనంగా 10 వేల ఉద్యోగుల సీటింగ్ సామర్థ్యం అందుబాటులోకి రానుందని తెలిపారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, నైపు ణ్యం కలిగిన యువత, ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణంతో తెలంగాణ ప్రపం చ సాంకేతిక కేంద్రంగా ఎదుగుతోందన్నారు. పోచారం ఇన్ఫోసిస్ క్యాంపస్ విస్తరణ రాష్ట్ర ఐటీ రంగ అభివృద్ధిలో మరో ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఇలాంటి పెట్టుబడులు యువతకు నూతన ఉపాధి అవకాశాలను కల్పించడంతో పాటు హైదరాబాద్ ను అంతర్జాతీయ ఐటీ గమ్యస్థానంగా మరిం త బలోపేతం చేస్తాయని తెలిపారు.

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు, సాంకేతిక అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని వివరించారు. ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షి యల్ ఆఫీసర్ జయేష్ సంఘరాజ్ కా మాట్లాడుతూ హైదరాబాద్ తమ సంస్థ వృద్ధి ప్ర యాణంలో కీలక పాత్ర పోషిస్తోందని, పోచా రం క్యాంపస్ విస్తరణ తెలంగాణ పట్ల సంస్థకు ఉన్న నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. కొత్త కేంద్రం ద్వారా ప్రపంచస్థాయి క్లయింట్లకు అధునాతన సాంకేతిక సేవలు అందించ డంతో పాటు, ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన ప్ర తిభావంతులను తీర్చిదిద్దేందుకు అవకాశం కలుగుతుందన్నారు. 

మరిన్ని వార్తలు