ఆ భూములను అమ్ముతామనడం సిగ్గుచేటు

31-10-2026 | 05:00am
  1. సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు
  2. మియాపూర్‌లోని 550 ఎకరాలను కాపాడింది నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వమే
  3. అమ్ముకోబోతున్నది నేటి కాంగ్రెస్ ప్రభుత్వం
  4. కుట్రతోనే బీఆర్‌ఎస్‌పై బురదజల్లుతున్నారు
  5. మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం

హైదరాబాద్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పోరాడి కాపాడిన విలువైన ప్రభుత్వ భూమిని.. ఈ రోజు తాము అమ్ముకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) బహిరంగంగా ప్రకటించడం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీశ్‌రావు(Former Minister Harish Rao) విమర్శించారు. మియాపూర్‌లోని 550 ఎకరాల భూమి వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత, సీఎం మీడియా సమావేశం పెట్టి చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని సుప్రీంకోర్టు రికార్డులే స్పష్టం చేస్తున్నాయని వెల్లడించారు.

ఈ మేరకు శుక్రవారం ఎక్స్ వేదికగా హరీశ్‌రావు స్పందించారు. మియా పూర్ భూ వివాదం 2003లోనే ఎస్‌ఎల్‌పీగా సుప్రీంకోర్టుకు చేరిందని, 2013లో అది సివిల్ అప్పీల్‌గా మారిం దని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఈ విలువైన భూమి ప్రభుత్వం చేజారిపోకూడదని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢ నిశ్చయంతో వ్యవహరించారని గుర్తుచేశారు.

2015లోనే దేశంలోనే అత్యుత్తమ న్యాయవాదుల్లో ఒకరైన సీఎస్ వైద్యనాథన్‌ను ప్రత్యేకంగా నియమించారని, ఈ వివరాలన్నీ సుప్రీంకోర్టు రికార్డుల్లో స్పష్టంగా నమోదై, ప్రజలందరికీ అందుబాటులోనూ ఉన్నాయని తెలిపారు. సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనా థన్ 2015 ఏప్రిల్ 7 నుంచి తెలంగాణ ప్రభుత్వం తరఫున మియా పూర్ భూముల రక్షణ కోసం సు ప్రీంకోర్టులో వాదిస్తూ వచ్చారని, 2015 నుంచి 2023 వరకు దాదా పు 8 ఏళ్లపాటు బీఆర్‌ఎస్ ప్రభు త్వం ఈ భూముల పరిరక్షణకు అలుపెరగని న్యాయపోరాటం చేసిందని స్పష్టంచేశారు.

మియాపూర్ భూములకు సంబంధించిన ప్రతి పిటిషన్, ప్రతి అఫిడవిట్, సమగ్ర ఆధారాలను సుప్రీంకోర్టు ముం దు ఉంచింది నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నా రు. ఈ తీర్పుకు అసలు పునాది ‘ట్రినిటీ ఇన్‌ఫ్రా వెంచర్స్’ కేసేనని, గోల్డ్ స్టోన్ ప్రసాద్‌కు సంబంధించిన ఆ కేసు 2023 జూన్ 15న తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించిందని తెలిపారు. ఆనాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, ఆ కేసులోనూ సర్కారు తరఫున వాదించింది అదే వైద్యనాథన్ అని గుర్తుచేశారు.

నాడు తాము సాధించిన ఆ విజయమే, ఆ తీర్పులోని చట్టపరమైన అంశాలే నేడు మియాపూర్ భూముల తుది తీర్పుకు బలమైన ఆధారమయ్యాయని పేర్కొన్నారు. ఈ రికార్డులన్నీ సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో బహిరంగంగా ఉన్నప్పటికీ, తానే ఏదో సాధించినట్టు సీఎం ప్రెస్‌మీట్లు పెట్టి సంబురాలు చేసుకోవడం హాస్యాస్పదం, సిగ్గుచేటు అని విమర్శించారు. ప్రెస్‌మీట్ పెట్టి అబద్ధాలు ప్రచారం చేసినంత మాత్రాన అవి నిజాలు అయిపోవని హితవుపలి కారు. ఈ మీడియా సమావేశం వెనుక ఉన్న అసలు కుట్ర వేరే ఉందని, విలువైన జాతి సంపదను ప్రజల భవిష్యత్తు అవసరాలకు ఉపయోగించకుండా తెగనమ్ముకునే కుట్రకు తెర లేపారని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు