వరుణుడి దెబ్బకు సిటీ విలవిల.. రోడ్లపై నిలిచిన వర్షపు నీరు
హైదరాబాద్: నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, నానక్‌రాంగూడ, మణికొండ, షేక్‌పేట్, టోలిచౌకీ, రాజేంద్రనగర్, మాదాపూర్, యూసుఫ్‌గూడ, మెహిదీపట్నం, సికింద్రాబాద్, తుర్కయాంజల్, మన్నెగూడ, రాగన్నగూడ తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది.
ఒక్కసారిగా కురిసిన వర్షంతో నగరవాసులకు ఎండ వేడి నుంచి కొంత ఉపశమనం లభించింది. అయితే సాయంత్రం వేళ వర్షం పడటంతో ఆఫీసుల నుంచి ఇళ్లకు బయల్దేరిన ఉద్యోగులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం కారణంగా ప్రధాన రహదారులపై నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.
ముఖ్యంగా రద్దీ సమయాల్లో వర్షం కురవడంతో ట్రాఫిక్ (Traffic) నెమ్మదించింది. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాయంత్రం వేళ ఇంటికి చేరుకునేందుకు నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు.
మరోవైపు వర్షంతో వాతావరణం (Weather) చల్లబడటంతో ప్రజలకు కాస్త ఊరట లభించింది. అయితే రహదారులపై నీరు నిలిచిన ప్రాంతాల్లో ప్రయాణికులు జాగ్రత్తగా వెళ్లాలని సూచిస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం (Rainfall)తో రాకపోకలపై ప్రభావం పడుతోంది.