మొదలైన ఎన్నికల సందడి

30-10-2026 | 10:37pm

అల్వాల్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు పట్టభద్రుల ఓటు నమోదు కార్యక్రమంలో మునిగిపోయారు. ముఖ్యంగా మల్కాజిగిరి నియోజకవర్గంలోని మల్కాజిగిరి, అల్వాల్ సర్కిళ్లల్లో బీఆర్ ఎస్ , కాంగ్రెస్, బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో నాయకులు ఆన్ లైన్ ఓటరు నమోదు చేసుకోవాలని కోరుతూ పట్టభద్రులకు దరఖాస్తు ఫారాలు పంపిణీ చేశారు.

ఈ క్రమంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ మను చౌదరి, అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డితో కలిసి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ సర్కిల్ నెంబర్ 2 లో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమంపై ఆరా తీశారు పట్టభద్రుల  నమోదు కార్యక్రమం వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్యాం ప్రసాద్, అల్వాల్ తాసిల్దార్ రాములు, డిప్యూటీ కమిషనర్ భోగేశ్వరులు, సిబ్బంది పాల్గొన్నారు

మరిన్ని వార్తలు