రైతుల ఖాతాల్లోకి ‘పీఎం కిసాన్’ నిధులు

31-10-2026 | 05:15am
  1. 24వ విడత కింద రూ. 18,690 కోట్లు విడుదల
  2. ఒక్కో అన్నదాత అకౌంట్‌లో రూ. 2వేలు జమ
  3. దేశవ్యాప్తంగా 9.34 కోట్ల మందికి లబ్ధి
  4. స్కీమ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు రూ. 4.5 లక్షల కోట్లు బదిలీ చేశామన్న ప్రధాని మోదీ 
  5. దేశానికి కష్టమొస్తే ప్రతిపక్షాలకు సంబురమని ఆగ్రహం
  6. ఎవరేమన్నా చివరిశ్వాస దాకా ప్రజల కోసమే పనిచేస్తానని వెల్లడి

భిల్డి, అక్టోబర్ 30: దేశవ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి ‘పీఎం కిసాన్’ స్కీమ్ నిధులను ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) విడుదల చేశారు. 24వ విడత కింద రూ. 18,690 కోట్లు రిలీజ్ చేశారు. ఒక్కో రైతు అకౌంట్‌లో రూ. 2వేలు జమ చేశారు. శుక్రవారం గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా భిల్డిలో ఏర్పాటు చేసిన సభా వేదిక నుంచి ఆయన నిధులను విడుదల చేశారు. 9.34 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతులకు ఈ పథకం కింద ప్రయోజనం చేకూరుతున్నదని వివరించారు.

పెట్టు బడి సాయం కింద ఒక్కో రైతుకు రూ. 2వేల చొప్పున ఏటా మూడు విడతల్లో  రూ. 6వే లు ‘పీఎం కిసాన్’ నిధులను కేంద్రం ఇస్తున్నది. 2019లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 4.5 లక్షల కోట్ల నిధులను రైతుల ఖాతాల్లోకి బదిలీ చేశామని ప్రధాని మోదీ వెల్లడించారు. 12ఏండ్లలో ఫసల్ బీమా యోజన కింద అన్నదాతలకు రూ. 2లక్షల కోట్లకుపైగా పరిహారం అందజేశామన్నారు. గత కొన్నేండ్లలోనే వివిధ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా రైతులకు రూ. 50 లక్షల కోట్లకుపైగా ఆర్థిక ప్రయోజనం చేకూరిందని ఆయన తెలిపారు. 

దేశానికి కష్టమొస్తే ప్రతిపక్షాలకు సంబురం

ఇరాన్ యుద్ధం వల్ల అనేక దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. దేశ ఇంధన భద్రతకు, ఎరువుల దిగుమతులకు కీలకమైన గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయన్నా రు. ఎరువుల ధరలు కూడా ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయాయని, అయినా మన రై తులపై భారం పడకుండా ప్రభుత్వమే భరిస్తున్నదని ఆయన తెలిపారు. ‘పశ్చిమాసియాలోని యుద్ధం వల్ల దేశంలో ఎరువులు, వంట గ్యాస్ కొరత ఏర్పడుతున్నదంటూ జనంలో కొందరు భయాందోళనలు సృష్టిస్తున్నారు.

తప్పుడు ప్రచారం చేస్తూ రైతుల్లో క లవరానికి కారణమవుతూ కృత్రిమంగా క్యూలు ఏర్పడేలా చేస్తున్నారు. వంట గ్యాస్ కూడా ఉండదని మహిళలను భయపెడుతున్నారు. దేశానికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, సంక్షోభంలో ఉన్నప్పుడు ఆ కొందరు సంబురాలు చేసుకుంటారు.. సంతోషంగా ఉంటారు. ఆ కష్టాలను, సంక్షోభాన్ని రాజకీయాల కోసం వాడుకుంటారు. రైతులు, యువత, మహిళ లు ఈ దేశాభివృద్ధికి ఎంతో కృషి చేస్తుంటే.. ఆ కొందరు మాత్రం దేశం అభివృద్ధి చెందుతుంటే జీర్ణించుకోలేకపోతున్నారు.

ఈర్ష్యపడుతున్నారు’ అని ప్రతిపక్షాలపై ప్రధాని మండిపడ్డారు. ఇరాన్ యుద్ధంతో ఇబ్బందులు ఎదురవుతున్నా.. తాము దేశ ప్రజల కోసం అన్ని రకాల చర్యలు చేపట్టామని.. రై తులపై ఎరువుల ధరల భారం పడకుండా ప్రభుత్వమే భరిస్తున్నదన్నారు. ‘అంతర్జాతీ య మార్కెట్‌లో యూరియా బస్తా ధర రూ. 3వేల వరకు ఉంది. ఆ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ.. రైతులకు రూ.300లోపే అందిస్తున్నది. డీఏపీ బస్తా  రూ. 5వేలు దా టింది.  మనం రూ.1, 350కే ఇస్తున్నాం’ అన్నా రు.

ఎవరేమన్నా వెనక్కి తగ్గను

తనపై విమర్శలు చేసే క్రమంలో దేశవ్యాప్తంగా అశాంతిని సృష్టించేందుకు ప్రతిపక్షా లు ప్రయత్నిస్తున్నాయని ప్రధాని మోదీ అ న్నారు. ‘ఎవరెన్ని మాటలన్నా.. నేను వెనక్కి తగ్గను. నా చివరి శ్వాస వరకు దేశ ప్రజల సేవ కోసమే పనిచేస్తా’ అని తెలిపారు. ఇటీవల ప్రధాని మోదీని ఉద్దేశించి.. ‘మోదీ తం డ్రి కూడా దిగిపోవాల్సిందే’ అంటూ ఏఐసీ సీ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన కామెంట్లకు పరోక్షంగా ఆయన కౌంటర్ ఇచ్చారు. కాగా, గుజరాత్‌లో ప్రధాని మోదీ రూ. 14 వేల కో ట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 


మరిన్ని వార్తలు