పేకాట స్థావరాలపై పోలీసుల మెరుపు దాడి
బెజ్జూర్ అక్టోబర్ 29 (విజయ క్రాంతి ): బెజ్జూర్ మండలంలో పేకాట సావరాలపై(Gambling dens) ఎస్సై రమేష్(SI Ramesh) ఆధ్వర్యంలో పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు.పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై కె. రమేష్ తన సిబ్బందితో కలిసి సదరు ప్రదేశంపై దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతూ ఐదుగురు వ్యక్తులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
పట్టుబడిన వారిలో శివ ప్రసాద్, శంకర్, గంగయ్య,. తిరుపతి,ఓదెలు. వీరి వద్ద నుంచి 52 పేకముక్కలు, నగదు రూ.2,500/- రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటనకు సంబంధించి సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై రమేష్(SI Ramesh) తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, ప్రజలు ఇలాంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల గురించి సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని కోరారు.