కాంగ్రెస్‌లోకి వలసల జోరు

12-09-2026 | 05:58pm

* కామంచికల్ గ్రామపంచాయతీ పరిధిలో బీఆర్‌ఎస్‌, సీపీఐ నుంచి 25కుటుంబాల చేరిక

ఖమ్మం రూరల్‌: కామంచికల్‌ గ్రామపంచాయతీ పరిధిలో  బీఆర్‌ఎస్‌(BRS), సీపీఐ(CPI) పార్టీలకు చెందిన 25 కుటుంబాలు కాంగ్రెస్‌ పార్టీలో చేరాయి. శనివారం ఖమ్మంలోని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో క్యాంప్ కార్యాలయ ఇన్‌చార్జ్ తుంబూరు దయాకర్‌రెడ్డి వారికి కాంగ్రెస్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం అంటేనే ప్రజల ప్రభుత్వమని అన్నారు. ప్రజా పాలనలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలను గడపగడపకూ చేరుస్తున్నామని పేర్కొన్నారు. ప్రజా పాలనకు జై.. కాంగ్రెస్‌లో చేరికలకు సై అంటూ వలసల జోరు కొనసాగుతోందని అన్నారు.కాంగ్రెస్‌లో చేరిన ప్రతి ఒక్కరికీ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ప్రతాపనేని రఘు, మాజీ సర్పంచ్ యాదా లింగయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నాగేశ్వరరావు, ఆత్మ కమిటీ డైరెక్టర్ మక్కా మల్లయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ కె. మైబు, జంగాల రామారావు, చింతకాయల వెంకన్న, బండారు నాగేశ్వరరావు, దాసరి వెంకటనారాయణ, అనంతనేని మురళి, లక్ష్మణ్, జంగం అశోక్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు