రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి: బీజేపీ ధర్నా

12-09-2026 | 06:42pm

కామారెడ్డి-సిరిసిల్ల రహదారిపై బైఠాయించి నిరసన

గంభీరావుపేట,(విజయక్రాంతి): రైతులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా కల్పించాలని డిమాండ్ చేస్తూ గంభీరావుపేట మండలం(Gambhiraopet Mandal)లో బీజేపీ నాయకులు శనివారం ఆందోళనకు దిగారు. కామారెడ్డి-సిరిసిల్ల ప్రధాన రహదారిపై రాజేశ్వర్ నగర్ కాలనీ సమీపంలో బీజేపీ మండల అధ్యక్షుడు కోడె రమేష్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ సరఫరాలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. సమయానికి కరెంటు అందక పంటలు ఎండిపోతున్నాయని, రైతులు(Farmers) తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, విద్యుత్ సమస్యల(Electrical problems)ను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.యూరియా అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, అవసరం మేరకు పంటలకు యూరియా అందించాలని,ట్రాన్స్పోర్ట్ పేరుతో రైతుల నుండి ఎలా అధికంగా డబ్బులు తీసుకుంటారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ధార్మిక సెల్ జిల్లా కన్వీనర్ డాక్టర్ సత్యనారాయణ, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి తోట్ల మల్లేష్ యాదవ్, దేవేందర్ యాదవ్ ఒరగంటి ఎల్లం, బండ దేవయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు