అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

12-09-2026 | 07:06pm

హత్యకు గురైనట్టుగా పోలీసులు నిర్ధారణ

ఆళ్ళపల్లి(విజయక్రాంతి): అనుమానస్థితిలో వ్యక్తి మృతి(Man dies) చెందిన ఘటన మండల పరిధిలోని మర్కోడు పంచాయతీ(Markodu Panchayat) సుద్దరేవు లో చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఐ సోమేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం సుద్దరేవు గ్రామ సమీపంలో వాగు వద్ద మృతదేహం ఉన్నదని సమాచారం మేరకు ఘటనా స్థలికి వెల్లడం జరిగిందని, విచారణలో మృతుడు నూనెం రాం నారాయణ గత నాలుగేళ్ల నుండి సుద్దరేవు గ్రామంలో నివాసముంటున్నారు గ్రామంలో దిష్టి, యంత్రాలు కట్టడం వంటివి చేసేవాడని, శుక్రవారం ఉదయం అనుమానస్పదంగా మృతి చెందాడని తెలిపారు. మృతదేహాన్ని పరిశీలించిన తర్వాత జాతిపై కత్తి గాయాలు ఉండడంతో  హత్య చేశారని ప్రాథమిక విచారణ లో తెలిసిందని ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు