ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
ముకరంపుర, నవంబర్ 4 (విజయ క్రాంతి): ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఎంప్లాయిస్ యూనియన్ ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరారు.ఆర్టీసీ కరీంనగర్ రీజినల్ కార్యవర్గ సమావేశం బుధవారం స్థానిక బద్ధం ఎల్లారెడ్డి భవన్ ఏఐటియుసి కార్యాలయంలో జరిగిన సందర్భంగా ఎంప్లాయిస్ యూనియన్ రీజినల్ గౌరవాధ్యక్షులు కంది అశోక్ రెడ్డి,
చైర్మన్ టేకుమల సమ్మయ్య, రీజినల్ కార్యదర్శి కొమురయ్య లు మాట్లాడుతూ రీజనల్ లో అన్ని రంగాల కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలని,దీనికి అధికారులందరూ సహకరించాలని,అలాగే రీజనల్ లో డ్రైవర్లకు, కండక్టర్లకు,ఇతర సిబ్బందికి సెలవుల మంజూరులో కానీ, సిక్ లీవ్ లతో పాటు మరే ఇతర సమస్యలైన యూనియన్ కు సహకరించాలని వారు కోరారు.
ప్రవళిక మరణం పై సంతాపం వ్యక్తం చేసిన యూనియన్
బస్సులో నుండి తోయడంతో విధి నిర్వహణలో మరణించిన ఆర్టీసీ కార్మికురాలు ప్రవళిక కుటుంబానికి ఎంప్లాయిస్ యూనియన్ తీవ్ర సంతాపాన్ని సానుభూతి వ్యక్తం చేస్తుందని తెలిపారు. ఆర్టీసీ కార్మికురాలు ప్రవళికకు రావలసిన బెనిఫిట్స్ వెంటనే ఆర్టీసీ యాజమాన్యం చెల్లించాలని వారు కోరారు.
ఎంప్లాయిస్ యూనియన్ రీజనల్ కమిటీ ఎన్నిక కరీంనగర్ రీజినల్ నూతన కమిటీని 31 మందితో ఎన్నుకోవడం జరిగింది. 15 మందిని ఆఫీస్ బేరర్స్ గా 16 మందిని కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.గౌరవ అధ్యక్షులుగా కంది అశోక్ రెడ్డి,చైర్మన్ గా టేకుమల సమ్మయ్య, అధ్యక్షులుగా గణపతి,
వర్కింగ్ ప్రెసిడెంట్ .ఎం శివకృష్ణ, ఉపాధ్యక్షులుగా ఏవై.రెడ్డి, వి.దేవయ్య,టీవీ ప్రసాద్, ఐలయ్య,ప్రధాన కార్యదర్శిగా కొమురయ్య యాదవ్, కార్యదర్శులుగా పి రజిత,సిహెచ్ శ్రీనివాస్, జె. రవి, వి. మహేందర్ జె. జ్యోతి,ఏ.శ్రీనివాస్ కోశాధికారిగా కే బుచ్చయ్య లతోపాటు 16 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.