అభివృద్ధి పనుల పరిశీలన

06-10-2026 | 07:26pm

ముకరంపుర, అక్టోబర్ 6 (విజయ క్రాంతి):డివిజన్‌లో చేపడుతున్న నూతన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రూ.60 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్లు మరియు డ్రైనేజీ నిర్మాణ పనులను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు(Deputy Mayor Yadagiri Sunil Rao) మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన నిర్మాణ పనుల నాణ్యతను పరిశీలించి, సంబంధిత కాంట్రాక్టర్లకు మరియు అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. డ్రైనేజీ మరియు సీసీ రోడ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని, పనుల్లో ఎక్కడా రాజీ పడకూడదని స్పష్టం చేశారు. స్థానిక ప్రజలకు రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, నిర్దేశిత కాలపరిమితిలోగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.

పనుల పురోగతిని అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సూచించారు. డివిజన్ పరిధిలోని ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రధాన ధ్యేయమని, అభివృద్ధి పనులను వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, మున్సిపల్ అధికారులు, కాంట్రాక్టర్లు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు