కొండగట్టు అంజన్నను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
కొడిమ్యాల,(విజయక్రాంతి): చొప్పదండి నియోజకవర్గం లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి(Kondagattu Anjaneya Swamy Temple)ని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి ఈ.వి. వేణుగోపాల్(Telangana High Court Justice E.V. Venugopal) కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు న్యాయమూర్తి ఈ.వి.వేణుగోపాల్ కు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
అనంతరం న్యాయమూర్తి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణలతో ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు శేషవస్త్రాన్ని అందజేశారు. ఇట్టి కార్యక్రమంలో ఆలయ పరిశీలకులు లక్ష్మా రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు చిరంజీవ స్వామి,ఉప ప్రధాన అర్చకులు రామచంద్ర ప్రసాద్, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.