డ్రైవర్ లేకుండానే కదిలిన కారు.. వీడియో వైరల్

19-10-2026 | 01:04pm

కారులో కీ లేదు.. స్టార్ట్ చేసింది ఎవరు? 

మెయిన్‌పురి: ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో చోటుచేసుకున్న ఓ వింత ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా(Social media Viral) మారింది. పార్క్ చేసి ఉన్న Tata Tiago EV (Electric Car) డ్రైవర్ లేకుండానే అకస్మాత్తుగా కదలడం స్థానికంగా కలకలం రేపింది. జైల్ రోడ్డులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన CCTV Footage బయటకు రావడంతో అసలేం జరిగిందనే చర్చ మొదలైంది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు.

కారు యజమాని సౌరభ్ రాథోడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆయన ఆఫీసులో ఉన్న సమయంలో మేనల్లుడు కారును శుభ్రం చేసేందుకు బయటకు తీసుకొచ్చాడు. ఆ సమయంలో కారులో కీ లేదని ఆయన పేర్కొన్నారు. ఇంతలోనే కారు అకస్మాత్తుగా ముందుకు కదిలి మేనల్లుడిని కిందపడేసినట్లు, ఆ తర్వాత రివర్స్‌లో వెనక్కి వెళ్లినట్లు సమాచారం. ఈ అనూహ్య పరిణామంతో అక్కడున్నవారు భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఈ Viral Car Video నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

ఈ ఘటనపై స్పందించిన కారు యజమాని వాహనంలో ఏదైనా Technical Fault ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కంపెనీకి ఫిర్యాదు చేయడంతో పాటు అవసరమైతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. అయితే కారు ఎందుకు కదిలింది? నిజంగానే ఏదైనా Electric Vehicle Safety Issue ఉందా? అనే ప్రశ్నలకు ఇంకా స్పష్టమైన సమాధానం లేదు. వాహనంలో సాంకేతిక లోపం ఉన్నట్లు ఇప్పటివరకు అధికారిక నిర్ధారణ వెలువడలేదు. ఘటనకు గల అసలు కారణం తెలియాలంటే సాంకేతిక పరిశీలన అవసరమని అధికారులు తెలిపారు.


మరిన్ని వార్తలు