జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఆయుధ పూజ
జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు
ములుగు,(విజయక్రాంతి): విజయదశమి (దసరా) పర్వదినాన్ని పురస్కరించుకుని ములుగు జిల్లా(Mulugu District) పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో జిల్లా ఎస్పీ కేకాన్ సుధీర్ రామ్‌నాథ్(SP Kekan Sudhir Ramnath) ఆధ్వర్యంలో సోమవారం ఆయుధ పూజ(Ayudha Puja) కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ విధి నిర్వహణలో ఉపయోగించే ఆయుధాలు, పోలీసు వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం సేవలందించే పోలీసు సిబ్బంది క్షేమంగా ఉండాలని, జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పోలీసు సిబ్బంది నిరంతరం కృషి చేయాలని సూచించారు. పండుగల సమయంలో ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో వేడుకలు జరుపుకునేలా పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ తరఫున ఎస్పి జిల్లా ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఏఎస్పి ఏటూరునాగారం మనన్ భట్ ఐపీఎస్, అదనపు ఎస్పీ సదానందం, డీఎస్పీ డీసీఆర్బీ కిషోర్ కుమార్, ములుగు డీఎస్పీ నలువాల రవీందర్, ములుగు సీఐ దారం సురేష్, ఆర్ఐ అడ్మిన్ స్వామి, ఆర్ఐ ఆపరేషన్స్ తిరుపతి, ఆర్ఐ ఎంటీవో వెంకటనారాయణ, ఆర్ఐ హోంగార్డ్స్ అండ్ వెల్ఫేర్ శ్రీకాంత్, ములుగు ఎస్ఐ వెంకటేశ్వర్లు, వెంకటాపురం ఎస్ఐ చల్లా రాజు, ఎస్ఐ తాజుద్దీన్, ఎస్ఐ కృష్ణ ప్రసాద్, ఇతర ఎస్ఐలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.