పాతబస్తీలో అగ్నిప్రమాదం

19-10-2026 | 03:53pm

హైదరాబాద్: నగరంలోని పాతబస్తీ(Old City)లో అగ్నిప్రమాదం(Fire accident) కలకలం రేపింది. మదీనా క్రాస్ రోడ్ వద్ద ఉన్న ఓ వస్త్ర దుకాణం, గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో ఉన్న స్థానికులు అప్రమత్తమై అక్కడి నుంచి పరుగులు తీశారు. అగ్నిప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు.

మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా వాటిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. వస్త్ర దుకాణం(Textile Shop), గోదాములో మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు, ఆస్తి నష్టం, ఎవరైనా గాయపడ్డారా అనే సమాచారం అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది.

మరిన్ని వార్తలు