బతుకమ్మ వేడుకల్లో లాఠీచార్జ్
సర్పంచ్, ఉపసర్పంచ్పైన దాడి ఆరోపణలు
మంచిర్యాల క్రైమ్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial district) దండేపల్లి మండలం తాళ్లపేటలో బతుకమ్మ వేడుకల(Bathukamma festival) సందర్భంగా వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ఫొటోలు దిగే విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తగా, పోలీసులు లాఠీచార్జ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. సర్పంచ్, ఉపసర్పంచ్‌తో పాటు పలువురిపై దాడి చేశారని, బతుకమ్మలను చెల్లాచెదురు చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనను నిరసిస్తూ కాంగ్రెస్ నాయకుడు మంతెన జగన్మోహన్రావు(Congress leader Jaganmohan Rao) వర్గీయులు అర్ధరాత్రి ధర్నా చేపట్టారు. లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీసీపీ హామీతో ధర్నా విరమించిన జగన్మోహన్రావు, విచారణ జరిపి చర్యలు తీసుకోకపోతే నియోజకవర్గంలోని అన్ని పోలీస్ స్టేషన్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.