కరీంనగర్ కమీషనరేట్ లో దసరా వేడుకలు

19-10-2026 | 03:03pm

ఆయుధ, జమ్మి , వాహన పూజల్లో పాల్గొన్న సీపీ గౌష్ ఆలం

కరీంనగర్ క్రైం,(విజయక్రాంతి): కమీషనరేట్ కేంద్రంలోని పోలీసు హెడ్ క్వార్టర్స్(Police Headquarters)లో దసరా  సందర్బంగా నిర్వహించిన ఆయుధ , జమ్మి, వాహన  పూజా కార్యక్రమాల్లో పోలీసు కమీషనర్ గౌష్ ఆలం(CP Goush Alam) పాల్గొన్నారు. ఈ సందర్బంగా పోలీసు కమీషనర్ మాట్లాడుతూ కమీషనరేట్ ప్రజలకు దసరా పండగ శుభాకాంక్షలు తెలిపారు.  కమీషనరేట్ ప్రజలంతా, ఆయురారోగ్యాలతో ఉండాలని పోలీసు కమీషనర్  ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ రిజర్వు ఇన్స్పెక్టర్లు జానీమియా, శ్రీధర్ రెడ్డి , కిరణ్ కుమార్ లతో పాటు ఇతర  పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు