అహోబిలంలో అగ్నికీలలు.. ఆరు దుకాణాలు దగ్ధం
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం దిగువ అహోబిలంలో అగ్నిప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ (Short Circuit) కారణంగా మంటలు చెలరేగి ఆరు దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. దుకాణాల్లో ఉన్న గ్యాస్ సిలిండర్లను (Gas Cylinders) సకాలంలో బయటకు తరలించడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు (Firefighters). ఈ ఘటనలో దుకాణాలకు భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది