గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి

19-10-2026 | 03:11pm

సర్పంచ్‌ రాధిక శ్రీనివాస్‌

అమ్మవారికి ప్రత్యేక పూజలు

గణపురం,(విజయక్రాంతి): గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని సర్పంచ్‌ రాధిక శ్రీనివాస్‌(Sarpanch Radhika Srinivas) అన్నారు. గణపురం మండల(Ganapuram Mandal) కేంద్రంలో సోమవారం శ్రీ మహిషాసురమర్దిని రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారికి  సర్పంచ్‌ కట్కూరి రాధిక శ్రీనివాస్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వినయ్‌ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి, పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

అమ్మవారికి పుష్పాలతో అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ రాధిక శ్రీనివాస్‌ అమ్మవారిని దర్శించుకుని గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.

మరిన్ని వార్తలు