ప్రతిష్ఠాత్మక మోస్ట్ ప్రామిసింగ్ రీసెర్చర్ అవార్డుకు డా. సుతారి సతీష్ ఎంపిక

19-10-2026 | 03:06pm

ములుగు,(విజయక్రాంతి): కేన్ మాన్ ఆఫ్ తెలంగాణ, వృక్షశాస్త్ర నిపుణులు, ములుగు వాస్తవ్యులు డా. సుతారి సతీష్ ప్రతిష్ఠాత్మకమైన ‘మోస్ట్ ప్రామిసింగ్ రీసెర్చర్ అవార్డు’(Most Promising Researcher Award) కు ఎంపికయ్యారు. సైంటిఫిక్ లారెల్స్ సంస్థ(Scientific Laurels Organization) ఈ అవార్డుకు ఆయనను ఎంపిక చేయడం విశేషం. పరిశోధన రంగంలో ఆయన చేస్తున్న కృషికి ఈ గుర్తింపు లభించింది అని ఈ సంధర్బంగా తెలిపారు.

ఇప్పటివరకు అంతర్జాతీయ స్థాయిలో 55 పరిశోధనా పత్రాలు ప్రచురించి, 18 పుస్తకాలు రాయడంలో భాగస్వామ్యం కావడమే కాక, తెలంగాణ-ఆంధ్ర రాష్ట్రాల నుండి 15 జాతుల కొత్త మొక్కలను పరిశోధనా రంగానికి పరిచయం చేశారు. పర్యావరణ పరిరక్షణ(Environmental Protection)కు, పాలంపేట కేన్ మొక్కల సంరక్షణకు 18 సంవత్సరాల పాటు కృషి చేశారు. ప్రస్తుతం వాగ్దేవి డిగ్రీ, పీజీ కళాశాల హనుమకొండలో వృక్షశాస్త్ర విభాగాధిపతిగా పనిచేస్తున్న ఆయనకు వాగ్దేవి యాజమాన్యం, ప్రిన్సిపల్, పలువురు అధ్యాపకులు, సహచరులు, విద్యార్థులు అభినందనలు తెలిపారు.

మరిన్ని వార్తలు