బాలికల పాదాలు కడిగిన సీఎం యోగి

19-10-2026 | 03:45pm

కన్యాపూజలో ప్రత్యేక ఘట్టం!

గోరఖ్‌పూర్: నవరాత్రి మహానవమి(Navratri Mahanavami) సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(CM Yogi Adityanath) సంప్రదాయబద్ధంగా కన్యాపూజ నిర్వహించారు. గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ ఆలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నారులను దుర్గాదేవి స్వరూపాలుగా భావించి పూజలు చేశారు. ఈ సందర్భంగా బాలికల పాదాలను కడిగిన సీఎం యోగి, వారికి పూజలు నిర్వహించి వస్త్రాలు, ప్రసాదం, కానుకలు అందించారు. కన్యాపూజలో భాగంగా చిన్నారులకు గౌరవం తెలుపుతూ ఆశీర్వాదం తీసుకున్నారు.

నవరాత్రుల్లో కన్యాపూజ(Kanya Pujan) కు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. బాలికలను ఆదిశక్తి స్వరూపాలుగా భావించి పూజించడం ఈ ఆచారంలోని ప్రధాన విశేషం. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమం నవరాత్రి వేడుకల్లో ప్రత్యేకంగా నిలిచింది. మహానవమి సందర్భంగా విజయదశమి వేడుకలను ఉత్సాహంగా జరుపుకోవడంతో పాటు భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం యోగి ప్రజలకు పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు