భిక్కనూర్ సబ్‌స్టేషన్‌లో విద్యుత్ లోడ్ పరిస్థితిపై పరిశీలన
భిక్కనూర్,(విజయక్రాంతి): విద్యుత్ సరఫరా, లోడ్ నిర్వహణను పటిష్టం చేయడంపై టీజీఎన్పీడీసీఎల్ ఉన్నతాధికారులు(TGNPDCL senior officials) దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఆపరేషన్-1 చీఫ్ ఇంజనీర్ అశోక్, కామారెడ్డి ఎస్ఈ సాలియా, డీఈ, ఏడీఈ, ఏఈలతో కలిసి శుక్రవారం భిక్కనూర్(bhikkhunur ) 132/33 కేవీ సబ్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సబ్‌స్టేషన్‌లో ప్రస్తుత విద్యుత్ లోడ్ పరిస్థితి, సరఫరా తీరును సీఈ అశోక్ పరిశీలించారు.
రానున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని లోడ్‌కు అనుగుణంగా నిరంతర విద్యుత్ సరఫరా అందించాలని అధికారులకు సూచించారు. వినియోగదారులకు అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ అందించాలని ఆదేశించారు. సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే స్పందించి పరిష్కరించాలని సూచించారు. సబ్స్టేషన్ల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు స్పష్టం చేశారు.