టీబీ నిర్మూలనకు అన్ని శాఖలు కలిసి పనిచేయాలి
04-11-2026 | 06:31pm
భిక్కనూర్, నవంబర్ 4 (విజయ క్రాంతి): టీబీ నివారణ కోసం ప్రభుత్వం(government) ప్రవేశపెట్టిన జోష్ (JOSH) కార్యక్రమంపై(JOSH Program) భిక్కనూర్ పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ యేమిమ, ఆరోగ్య విస్తరణ అధికారి వెంకటరమణ ఎంపీడీవో సవితారెడ్డికి వివరించారు. క్షేత్రస్థాయిలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తే టీబీ వ్యాధిని నిర్మూలించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శులు కూడా భాగస్వాములై సహకరించాలని కోరారు.