ఘనంగా సిరికొండ మధుసూదనాచారి జన్మదిన వేడుకలు

13-10-2026 | 06:46pm

భూపాలపల్లి టౌన్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన, రాష్ట్ర తొలి శాసనసభాపతి సిరికొండ మధుసూదనాచారి(Sirikonda Madhusudhana Chary) జన్మదిన వేడుకలను కొత్తపల్లి ఎస్‌ఎం గ్రామంలోని 8వ వార్డులో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి మధుసూదనాచారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాపరాబోయిన రాకేష్, ముత్యాల వెంకన్న, ముత్యాల రాజుతో పాటు మహిళలు, చిన్నారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు.

మరిన్ని వార్తలు